ఏపీ లాసెట్‌కు 80శాతం హాజరు
ABN , Publish Date - May 05 , 2026 | 06:50 AM
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయజ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రశాంతంగా ముగిశాయి.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 4 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయజ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 100 పరీక్షా కేంద్రాల్లో రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించారు. తిరుపతిలోని అయాన్ డిజిటల్‌లో పరీక్షా కేంద్రాన్ని ఏపీ లాసెట్ చైర్ పర్సన్, పద్మావతి వర్సిటీ వీసీ ఉమ, రిజిస్ట్రార్ ఆర్.ఉష, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ టి.సీతాకుమారి పరిశీలించారు. పరీక్షలకు 30 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. మూడేళ్ల లా కోర్సుకు 78 శాతం, ఐదేళ్ల లా కోర్సుకు 83, ఎల్‌ఎల్‌ఎంకు 85.. మొత్తంగా 80 శాతం మంది హాజరయ్యారు.