Share News

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఎస్పీఓగా జె.విజయలక్ష్మి

ABN , Publish Date - May 05 , 2026 | 06:42 AM

ఆరోగ్యశాఖలో ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లకు ప్రభుత్వం జాయింట్‌ డైరెక్టర్లు(జేడీ)గా పదోన్నతి కల్పించింది.

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఎస్పీఓగా జె.విజయలక్ష్మి

  • రెండేళ్ల తర్వాత పోస్టు భర్తీ

  • ఆరోగ్య శాఖలో ఐదుగురికి జేడీలుగా పదోన్నతి

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖలో ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లకు ప్రభుత్వం జాయింట్‌ డైరెక్టర్లు(జేడీ)గా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరబ్‌ గౌర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ డైరెక్టర్లుగా ఉన్న వి.వెంకట శేషారెడ్డి, జె.విజయలక్ష్మి, ఎస్‌.సృజన, ఆర్‌.గణపతిరావు, ఎల్‌.శ్రీనివాసరావుకు జేడీలుగా పదోన్నతి పొందారు. ప్రమోషన్‌ పొందిన వారికి పోస్టింగులు ఇస్తూ, 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో ఉన్న వి.వెంకట శేషారెడ్డికి డీఎంఈ కార్యాలయంలో పోస్టింగ్‌ ఇచ్చింది. అలానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాళీగా ఉన్న నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ స్టేట్‌ ప్రొగ్రామ్‌ ఆఫీసర్‌(ఎన్‌హెచ్‌ఎం ఎస్పీఓ) పోస్టును ఆరోగ్య శాఖ ఎట్టకేలకు భర్తీ చేసింది. కీలకమైన ఈ పోస్టులో జె.విజయలక్ష్మిని నియమించింది. అలానే విశాఖ ఆర్డీ కార్యాలయంలో ఉన్న ఎస్‌.సృజనను నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా నియమించింది. ఏపీ శాక్స్‌లో డీడీగా ఉన్న ఆర్‌.గణపతిరావుకు డీఎంఈ కార్యాలయంలో జేడీగా పోస్టింగ్‌ ఇచ్చింది. రాజమండ్రి ఆర్డీ కార్యాలయంలో డీడీగా ఉన్న ఎల్‌ శ్రీనివాసరావును ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్ట్‌ అడ్మిన్‌ ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

Updated Date - May 05 , 2026 | 06:42 AM