Share News

వారి వినతిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి

ABN , Publish Date - May 05 , 2026 | 06:48 AM

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌తో పాటు ప్రమోషన్‌ చానల్‌ రూపకల్పన విషయంలో గత ఏడాది జనవరి 27న ఉద్యోగుల సంఘం ఇచ్చిన వినతిని...

వారి వినతిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి

  • గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌తో పాటు ప్రమోషన్‌ చానల్‌ రూపకల్పన విషయంలో గత ఏడాది జనవరి 27న ఉద్యోగుల సంఘం ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకొని నాలుగు వారాల్లో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని గ్రామ-వార్డు సచివాలయాల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌తో పాటు ప్రమోషన్‌ చానల్‌ రూపకల్పన చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ గ్రామ, వార్డు సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వలమల శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గత ఏడాది జనవరి 27న అసోసియేషన్‌ సమర్పించిన వినతిని పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది కోటా కృష్ణ దీప్తి వాదనలు వినిపించారు.

Updated Date - May 05 , 2026 | 06:49 AM