Share News

ఘన వ్యర్థాల సమర్ధ నిర్వహణకు ఉన్నత స్థాయి కమిటీ

ABN , Publish Date - May 05 , 2026 | 06:34 AM

రాష్ట్రంలో ఘన వ్యర్ధాల నిర్వహణను సమర్ధవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది

ఘన వ్యర్థాల సమర్ధ నిర్వహణకు ఉన్నత స్థాయి కమిటీ

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఘన వ్యర్ధాల నిర్వహణను సమర్ధవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ కో చైర్మన్‌గా, పీసీబీ సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా, అటవీ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, దేవాదాయ, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్యకార్యదర్శులు, మున్సిపల్‌ డైరెక్టర్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ, రైతుబజార్ల సీఈవోతోపాటు జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ, ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ ప్రొవైడర్స్‌, సిమెంట్‌ కంపెనీలు, హోటల్స్‌, రెస్టారెంట్ల ప్రతినిధులను సభ్యులుగా నియమించారు.

Updated Date - May 05 , 2026 | 06:35 AM