Share News

హజ్‌యాత్రకు బయల్దేరిన మరో 185 మంది

ABN , Publish Date - May 05 , 2026 | 06:39 AM

రాష్ట్రానికి చెందిన 185 మంది హైదరాబాద్‌ ఎంబార్కేషన్‌ కేంద్రం-శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సోమవారం హజ్‌యాత్రకు బయలుదేరారు.

హజ్‌యాత్రకు బయల్దేరిన మరో 185 మంది

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెందిన 185 మంది హైదరాబాద్‌ ఎంబార్కేషన్‌ కేంద్రం-శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సోమవారం హజ్‌యాత్రకు బయలుదేరారు. శంషాబాద్‌ సమీపంలోని విడిది కేంద్రం నుంచి విమానాశ్రయానికి బయలుదేరిన వాహనాలను రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్‌, మైనార్టీశాఖ కార్యదర్శి సీహెచ్‌ శ్రీధర్‌, హజ్‌కమిటీ చైర్మన్‌ హసన్‌ బాషా, సీఈవో గౌస్‌ పీర్‌ జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం మూడు విమానాల్లో మొత్తం 185 మంది హజ్‌యాత్రకు పయనమైనట్లు మంత్రి షరూక్‌ తెలిపారు.

Updated Date - May 05 , 2026 | 06:39 AM