విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
ABN , Publish Date - May 05 , 2026 | 08:55 AM
విశాఖపట్టణం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ గెజిట్‌ను కేంద్ర రైల్వే బోర్డు అధికారికంగా విడుదల చేసింది. జూన్ 1, 2026 నుంచి దక్షిణ కోస్తా రైల్వేను అధికారికంగా ప్రారంభించనుంది.
విశాఖపట్టణం, మే5 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్టణం కేంద్రంగా కొత్త రైల్వేజోన్ గెజిట్‌ను కేంద్ర రైల్వే బోర్డు అధికారికంగా విడుదల చేసింది. జూన్ 1, 2026 నుంచి దక్షిణ కోస్తా రైల్వేను అధికారికంగా ప్రారంభించనుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటైంది. వాల్తేరు డివిజన్‌ను విభజించి విశాఖపట్టణం, రాయగడ డివిజన్లుగా మార్పు చేసింది. దక్షిణ కోస్తా, ఈస్ట్ కోస్ట్, దక్షిణ మధ్య రైల్వేల పరిధిలో కీలక మార్పులు చేసింది. పాత వాల్తేరు డివిజన్‌లోని విశాఖ నగరం సహా పరిసర ప్రాంతాలు ఇకపై విశాఖపట్టణం డివిజన్‌గా మార్చింది.
రాయగడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద పనిచేస్తుందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా రైల్వే పరిధి కొత్త జోన్ పరిధిలోకి గుంతకల్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం డివిజన్లను ఏర్పాటుచేసింది. ఇకపై సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయని తెలిపింది. ఖుర్దా రోడ్ డివిజన్‌లో గల ‘ఇచ్ఛాపురం నుంచి పలాస’ వరకు గల మార్గాన్ని విశాఖపట్టణం డివిజన్‌కు బదిలీ చేసింది. గుంతకల్ డివిజన్ నుంచి ‘రాయచూర్ - వాడి సెక్షన్’ సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ అయింది.
పగిడిపల్లి - విష్ణుపురం మార్గాన్ని.. గుంటూరు డివిజన్ నుంచి సికింద్రాబాద్ డివిజన్‌కు మార్పు చేసింది. కొండపల్లి - మోటుమర్రి మార్గాన్ని సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్‌కు బదిలీ చేసింది. రాయగడ, విశాఖపట్టణం డివిజన్ల మధ్య సింగపూర్ రోడ్ - విజయనగరం కొత్త సరిహద్దు ఖరారు చేసింది. సౌత్ పోస్ట్, ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ల మధ్య స్పష్టమైన సరిహద్దు కిలోమీటర్లను గెజిట్‌లో రైల్వే బోర్డు వెల్లడించింది. ఈ మార్పులన్నీ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో రైల్వే బోర్డు స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ
మోదీ దార్శనికతపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: సీఎం చంద్రబాబు
ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం
Read Latest AP News And Telangana News And International News And Telugu New