Share News

హైదరాబాద్‌కు అంతర్జాతీయ దిగ్గజం బీఏఎస్‌ఎఫ్ రాక

ABN , Publish Date - May 05 , 2026 | 12:59 PM

హైదరాబాద్‌లో BASF గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బీఏఎస్‌ఎఫ్‌తో తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్‌తో దాదాపు 3 వేల మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

హైదరాబాద్‌కు అంతర్జాతీయ దిగ్గజం బీఏఎస్‌ఎఫ్ రాక
BASF Hyderabad Investment

హైదరాబాద్, మే 5: హైదరాబాద్‌లో జర్మనీకి చెందిన అంతర్జాతీయ దిగ్గజం బీఏఎస్‌ఎఫ్(BASF) గ్లోబల్ సర్వీస్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. BASFతో తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3,000 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు BASF ప్రతినిధులు లెటర్ ఆఫ్ ఇంటెంట్(LoI) అందజేశారు. ఈ సందర్భంగా BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించనున్నట్లు ప్రకటించారు. ఈ హబ్ ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ (HR) సేవలకు వ్యూహాత్మక కేంద్రంగా పని చేయనుంది.


గ్లోబల్ సర్వీస్ డెలివరీ నెట్‌వర్క్‌కు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనుంది.160 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అంతర్జాతీయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి ద్వారా తన సేవలను మరింత విస్తరించనుంది. తెలంగాణలో మరో మెగా గ్లోబల్ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంపై ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌పై అంతర్జాతీయ కంపెనీల నమ్మకం మరింత పెరుగుతోందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్‌కు లేదా: బండి సంజయ్

ఒకేరోజు 6 ప్రాంతాల్లో హైడ్రా దాడులు.. అక్రమ యూనిట్లపై ఉక్కుపాదం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 05 , 2026 | 02:31 PM