Share News

ఒకేరోజు 6 ప్రాంతాల్లో హైడ్రా దాడులు.. అక్రమ యూనిట్లపై ఉక్కుపాదం

ABN , Publish Date - May 05 , 2026 | 12:31 PM

హైదరాబాద్‌లో అక్రమ మైనింగ్‌పై హైడ్రా ఉక్కుపాదం మోపింది. ఒకే రోజు ఆరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన హైడ్రా.. 6 క్రషింగ్ యూనిట్లు, 12 RMC ప్లాంట్లను కూల్చివేసింది.

ఒకేరోజు 6 ప్రాంతాల్లో హైడ్రా దాడులు.. అక్రమ యూనిట్లపై ఉక్కుపాదం
HYDRA Hyderabad Raids

హైదరాబాద్, మే 5: హైదరాబాద్‌లో అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లు, RMC ప్లాంట్లపై హైడ్రా కఠిన చర్యలు చేపట్టింది. ఒక్క రోజులోనే 6 ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్లు నిర్వహించి, అక్రమ యూనిట్లపై దాడులు చేసి కూల్చివేతలు చేపట్టింది. గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలంలోని గౌలిదొడ్డి విలేజ్, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో హైడ్రా బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లలో 6 క్రషింగ్ యూనిట్లను తొలగించగా, 12 RMC ప్లాంట్లను కూల్చివేశారు.


పీసీబీ, మైనింగ్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ల ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ చర్యలు చేపట్టింది. సంబంధిత శాఖల ఆధ్వర్యంలోనే కూల్చివేతలు జరిగాయి. అక్రమ మైనింగ్, క్రషింగ్, ఆర్‌ఎమ్‌సీ ప్లాంట్లతో వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి అక్రమ యూనిట్లు గండికొడుతున్న పరిస్థితి. బడాబాబుల అండతో మైనింగ్, క్రషింగ్, RMC ప్లాంట్లు నడుస్తున్నట్లు సమాచారం. బడాబాబుల పైరవీలతో నడుస్తున్న యూనిట్లపై ఆయా శాఖల ఫిర్యాదులతో హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది.


ఇవి కూడా చదవండి...

ఆకివీడు రామాలయం నిర్మాణంపై పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

కేసీఆర్‌ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్‌కు లేదా: బండి సంజయ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 05 , 2026 | 12:37 PM