Share News

మరో రెండు మూడు రోజుల్లో యూఎస్, ఇరాన్ మధ్య డీల్.. పాక్ వర్గాల ధీమా

ABN , Publish Date - May 06 , 2026 | 09:20 PM

మరో రెండు మూడు రోజుల్లో అమెరికా, ఇరాన్ మధ్య డీల్ కుదిరే అవకాశం ఉందని పాక్ వర్గాలు చెబుతున్నాయి.

మరో రెండు మూడు రోజుల్లో యూఎస్, ఇరాన్ మధ్య డీల్.. పాక్ వర్గాల ధీమా
US Iran peace deal

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్, ఇరాన్ మధ్య శాశ్వత ప్రాతిపదికన శాంతి నెలకొనేలా ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని పాక్ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఇరు దేశాల మధ్య డీల్ కుదరవచ్చని పాక్ ఫారిన్ ఆఫీస్ వర్గాలు పేర్కొన్నాయి. వ్యవహారం తుది దశకు చేరుకుందని, మరో రెండు మూడు రోజుల్లో ఒప్పందం కుదరవచ్చని చెబుతున్నాయి. ఈ దిశగా ఇరాన్, అమెరికా బృందాలు త్వరలో ఇస్లామాబాద్‌కు కూడా వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

ఈ డీల్‌లో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరింత కాలం పాటు పొడిగించడంతో పాటు అన్ని రకాల దాడులకు పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఇరు వర్గాలు అంగీకరించే అవకావం ఉంది. ఇక అణు కార్యక్రమం, ఇతర భద్రతా వ్యవహారాలపై దశల వారీగా సమగ్ర చర్చలు జరిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించే ఛాన్స్ ఉంది. ఇరాన్ ప్రతిపాదనలను యూఎస్ స్థూలంగా అంగీకరించిందని కూడా పాక్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఒప్పందం ఖరారుకు ఇరాన్ మరింత సమయం కోరినట్టు చెప్పారు.


యూరేనియం శుద్ధి కార్యక్రమాన్ని కట్టిపెట్టడంతో పాటు, అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి వంటి వాటికి ఇరాన్ ఫుల్ స్టాప్ పెట్టాలని అమెరికా కోరుతోంది. ఇందుకు ప్రతిగా తమపై ఆంక్షలను తొలగించాలని, విదేశాల్లోని తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరుతోంది. హోర్ముజ్‌లో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేర్చడంతో పాటు ఈ జలసంధిని భవిష్యత్తులో ఇరాన్ ఒక ఆయుధంగా మార్చకూడదన్న నిబంధన కూడా ఈ డీల్‌లో ఉన్నట్టు సమాచారం.


ఈ వార్తలనూ చదవండి:

ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా

అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి

Updated Date - May 06 , 2026 | 09:42 PM