Share News

విశాఖలో ‘అల్లూరి స్ఫూర్తి యాత్ర’.. పాల్గొన్న పీవీఎన్ మాధవ్

ABN , Publish Date - May 07 , 2026 | 09:44 AM

అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ‘అల్లూరి స్ఫూర్తి యాత్ర’ నిర్వహించారు. గురువారం ఉదయం విశాఖ బీచ్ రోడ్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి భారీ సంఖ్యలో కార్లు, బైక్‌లతో ర్యాలీని ప్రారంభించారు.

విశాఖలో ‘అల్లూరి స్ఫూర్తి యాత్ర’.. పాల్గొన్న పీవీఎన్ మాధవ్
Visakhapatnam BJP Rally

విశాఖపట్నం, మే 7: స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ‘అల్లూరి స్ఫూర్తి యాత్ర’ నిర్వహించారు. గురువారం ఉదయం విశాఖ బీచ్ రోడ్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి భారీ సంఖ్యలో కార్లు, బైక్‌లతో ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.


అల్లూరి విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర ఆయన జీవితం, పోరాటం సంబంధిత ప్రాంతాల మీదుగా సాగనుంది. బ్రిటిష్ వారు అల్లూరి సీతారామరాజును బంధించిన మంప గ్రామం మీదుగా, ఆయనను కిరాతకంగా కాల్చి చంపిన రాజేంద్రపాలెం ప్రాంతాన్ని బీజేపీ నేతలు సందర్శించనున్నారు. అక్కడ నుంచి అల్లూరిని ఆంగ్లేయులు సమాధి చేసిన కె.డి.పేట చేరుకొని ఘన నివాళులు అర్పించనున్నారు.


ఇవి కూడా చదవండి...

భారత్ దేనినీ క్షమించదు.. ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీడియో..

నిరుద్యోగులకు శుభవార్త!

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2026 | 09:47 AM