టాప్ లేపిన రైజర్స్
ABN , Publish Date - May 07 , 2026 | 04:46 AM
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాప్‌నకు దూసుకెళ్లింది. క్లాసెన్ ...
నేటి మ్యాచ్
లఖ్‌నవూ X బెంగళూరు
వేదిక : లఖ్‌నవూ, రా.7.30
ఫ క్లాసెన్, ఇషాన్ హాఫ్ సెంచరీలు
ఫ పేలవ ఫీల్డింగ్‌తో
పంజాబ్ కుదేలు
ఫ కూపర్ శతకం వృథా
హైదరాబాద్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాప్‌నకు దూసుకెళ్లింది. క్లాసెన్ (43 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55) అర్ధ శతకాలతోపాటు బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 33 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మొత్తం 14 పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్ టాప్ లేపగా.. వరుసగా మూడో ఓటమితో పంజాబ్ రెండో స్థానానికి జారింది. తొలుత సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 235/4 స్కోరు చేసింది. నితీశ్ కుమార్ (29 నాటౌట్) రాణించాడు. అర్ష్‌దీప్, చాహల్, ఫెర్గూసన్ తలో వికెట్ దక్కించుకొన్నారు. ఛేదనలో పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 202/7 స్కోరు మాత్రమే చేసింది. కూపర్ కనోలీ (107 నాటౌట్) శతకం సాధించాడు. కమిన్స్, శివాంగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కమిన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
ఆరంభంలోనే తడ‘బ్యాటు’..: లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్ ఘోరంగా తడబడింది. కూపర్ మినహా మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య (1), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (3)తోపాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (5) సింగిల్ డిజిట్‌కే వెనుదిరగడంతో.. పంజాబ్ 23/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కూపర్, స్టొయినిస్ (28) నాలుగో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను గాడిలోపెట్టే ప్రయత్నం చేశారు. అయితే, స్టొయిని్‌సను శివాంగ్ అవుట్ చేసి దెబ్బకొట్టాడు. సాధించాల్సిన రన్‌రేట్ పరుగుతున్న తరుణంలో సూర్యాంశ్ (25)తో కలసి కూపర్ స్కోరు బోర్డును నడిపించే బాధ్యత తీసుకొన్నాడు. పరుగుల వేగం పెరుగుతున్న తరుణంలో సూ ర్యాంశ్‌ను అవుట్ చేసిన కమిన్స్.. ఐదో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. శశాంక్ (4) కూడా విఫలం కావడంతో పంజాబ్ పరాజయం లాంఛనమే అయింది. అయితే, కూపర్, యాన్సెన్ (19) ఏడో వికెట్‌కు 68 పరుగులు జోడించి ఓటమి అంతరాన్ని తగ్గించారు. చివరి ఓవర్‌లో యాన్సెన్‌ను శివాంగ్ అవుట్ చేసినా.. కూపర్ సిక్స్‌తో శతకం పూర్తి చేసుకొన్నాడు.
అదరగొట్టిన బ్యాటర్లు..: టాపార్డర్ బ్యాటర్లు దుమ్మురేపడంతో.. సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. పంజాబ్ ఫీల్డింగ్ వైఫల్యాలు కూడా ప్రత్యర్థి పుంజుకొనేందుకు అవకాశాలు కల్పించాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ (35), ట్రావిస్ హెడ్ (38) తొలి వికెట్‌కు 54 పరుగులతో అదిరే ఆరంభాన్నిచ్చారు. రెండో ఓవర్‌లో యాన్సెన్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదిన అభిషేక్ 21 పరుగులు రాబట్టాడు. అయితే, నాలుగో ఓవర్‌లో ఫెర్గూసన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన అభిషేక్.. ఆ తర్వాతి బంతికి క్యాచౌటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కిషన్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో.. పవర్‌ప్లేను హైదరాబాద్ 79/1తో ముగించింది. ఏడో ఓవర్‌లో హెడ్‌ను అవుట్ చేసిన చాహల్ దెబ్బకొట్టాడు. దీంతో రెండో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో కిషన్, క్లాసెన్ మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించి.. జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. చాహల్ బౌలింగ్‌లో పంజాబ్ ఫీల్డర్లు క్యాచ్‌లను చేజార్చడంతో.. బతికిపోయిన వీరిద్దరూ మిడిల్ ఓవర్లలో నిలకడగా స్కోరు బోర్డును నడిపించారు. కాగా, వైశాక్ వేసిన 14వ ఓవర్‌లో గేర్ మార్చిన ఇషాన్ హ్యాట్రిక్ సిక్స్‌లతో అర్ధ శతకం పూర్తి చేసుకొన్నాడు. కానీ, ఆ తర్వాతి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్.. డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడగా.. ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న క్లాసెన్ చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ 32 బంతుల్లో 63 పరుగులు జోడించడంతో.. సన్‌రైజర్స్ స్కోరు 230 దాటింది. కానీ, ఆఖరి బంతికి క్లాసెన్‌ను వైశాక్ అవుట్ చేశాడు.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ (సి) అయ్యర్ (బి) ఫెర్గూసన్ 35, హెడ్ (సి) యాన్సెన్ (బి) చాహల్ 38, ఇషాన్ (సి) సూర్యాంశ్ (బి) అర్ష్‌దీప్ 55, క్లాసెన్ (సి) యాన్సెన్ (బి) వైశాక్ 69, నితీశ్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 235/4; వికెట్ల పతనం: 1-54, 2-84, 3-172, 4-235; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-43-1, యాన్సెన్ 4-0-61-0, ఫెర్గూసన్ 4-0-41-1, చాహల్ 4-0-32-1, వైశాక్ 4-0-54-1.
పంజాబ్: ప్రియాన్ష్ (సి) మలింగ (బి) కమిన్స్ 1, ప్రభ్‌సిమ్రన్ (సి) కమిన్స్ (బి) నితీశ్ 3, కూపర్ (నాటౌట్) 107, శ్రేయాస్ (సి) కమిన్స్ (బి) మలింగ 5, స్టొయినిస్ (సి) ఇషాన్ (బి) శివాంగ్ 28, సూర్యాంశ్ (సి) అభిషేక్ (బి) కమిన్స్ 25, శశాంక్ (సి) నితీశ్ (బి) సకీబ్ 4, యాన్సెన్ (సి) దూబే (బి) శివాంగ్ 19, వైశాక్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 202/7; వికెట్ల పతనం: 1-4, 2-4, 3-23, 4-63, 5-110, 6-119, 7-187; బౌలింగ్: కమిన్స్ 4-0-34-2, నితీశ్ 2-0-11-1, మలింగ 4-0-36-1, సకీబ్ 4-0-40-1, శివాంగ్ 4-0-45-2, హర్ష్ దూబే 2-0-36-0.
పేలవ ఫీల్డింగ్..
క్యాచ్‌లను చేజార్చిన పంజాబ్.. భారీ మూల్యమే చెల్లించుకొంది. ఫెర్గూసన్ వేసిన 8వ ఓవర్లో ఇషాన్ క్యాచ్‌ని కనోలీ పట్టలేకపోయాడు. 9వ ఓవర్‌లో చాహల్ బౌలింగ్‌లో.. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లాసెన్ ఇచ్చిన క్యాచ్‌ను శశాంక్ చేజార్చాడు. 11వ ఓవర్‌లో చాహల్ బౌలింగ్‌లోనే ఇషాన్ ఇచ్చిన క్యాచ్‌ను ఫెర్గూసన్ నేలపాలు చేశాడు. ఇక ఇషాన్‌ను స్టంపింగ్ చేసే అవకాశాన్ని ప్రభ్‌సిమ్రన్ మిస్ చేశాడు. దీంతో క్లాసెన్, ఇషాన్ అర్ధసెంచరీలతో చెలరేగి భారీస్కోరుకు బాటలువేశారు.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
హైదరాబాద్ 11 7 4 0 14 0.737
పంజాబ్ 10 6 3 1 13 0.571
బెంగళూరు 9 6 3 0 12 1.420
రాజస్థాన్ 10 6 4 0 12 0.510
గుజరాత్ 10 6 4 0 12 -0.147
చెన్నై 10 5 5 0 10 0.151
ఢిల్లీ 10 4 6 0 8 -0.949
కోల్‌కతా 9 3 5 1 7 -0.539
ముంబై 10 3 7 0 6 -0.649
లఖ్‌నవూ 9 2 7 0 4 -1.076
ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు
ఇవి కూడా చదవండి:
సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్
భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!