భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!
ABN , Publish Date - May 06 , 2026 | 04:00 PM
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ భారత ద్వితీయ శ్రేణి టీ20 భారత జట్టును ఎంచుకున్నాడు. అందులో వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్‌గా చోటు ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. ప్రపంచ మేటి బౌలర్లను కూడా తొలి బంతి నుంచే అటాక్ చేస్తూ సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీని టీమిండియాలోకి తీసుకోవాలంటూ గత కొద్ది రోజులుగా డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ భారత ద్వితీయ శ్రేణి టీ20 భారత జట్టును ఎంచుకున్నాడు. అందులో వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్‌గా చోటు ఇచ్చాడు.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతంగా రాణిస్తోన్న యశస్వి జైస్వాల్‌ను పక్కన పెట్టి వైభవ్‌ను ఎంచుకోవడం విశేషం. వైభవ్‌తో పాటు ఓపెనర్‌గా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు బిషప్ ఛాన్స్ ఇచ్చాడు. బ్యాకప్ ఓపెనర్‌గా పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ప్లేయర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు చోటు దక్కింది. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడాడు. ‘నా జట్టులో ముగ్గురు ఓపెనర్లను తీసుకుంటాను. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేస్తాను. అతడు అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడని నమ్ముతున్నాను. ఇక మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్ వంటి స్టార్ ప్లేయర్లు సరిగ్గా సరిపోతారు. ఆల్‌రౌండర్లలో కృనాల్ పాండ్య, నితీశ్ కుమార్ రెడ్డి, బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్‌ను ఎంపిక చేస్తాను’ అని బిషప్ తెలిపాడు.
ఐర్లాండ్ టూర్‌కు వైభవ్!
ఐపీఎల్ 2026 తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య వంటి యువ ప్లేయర్లకు భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, యువ ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు బీసీసీఐ.. రెండు టీ20 జట్లను తయారు చేయనున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
నితీశ్ రాణా ఔట్‌పై సోషల్ మీడియాలో వార్.. అసలేం జరిగిదంటే.?
సంజు అద్భుత ఇన్నింగ్స్.. గావస్కర్ ఫిదా!