Share News

ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్ వేదికలు ప్రకటించిన బీసీసీఐ.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?

ABN , Publish Date - May 06 , 2026 | 02:05 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు సంబంధించి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీంతోపాటు ఫైనల్ పోరుకు బెంగళూరు కాకుండా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను వేదికగా చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్ వేదికలు ప్రకటించిన బీసీసీఐ.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు సంబంధించి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీంతోపాటు ఫైనల్ పోరుకు బెంగళూరు కాకుండా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను వేదికగా చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫైనల్ మ్యాచ్ వేదికపై కొనసాగుతోన్న అనిశ్చితికి బ్రేక్ పడినట్లు అయింది. ఈసారి దక్షిణ భారతంలో ఒక్క నాకౌట్ మ్యాచ్ నిర్వహణకు కూడా అవకాశం లేకుండా పోయింది. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు రెండు వేదికలను మాత్రమే బీసీసీఐ కేటాయించింది. మే 24తో లీగ్ స్టేజ్‌ మ్యాచ్‌లు ముగియనున్నాయి.


‘ఫైనల్ పోరుకు తొలుత బెంగళూరును నిర్ణయించారు. అయితే మా నిర్దేశిత మార్గదర్శకాలు, నిబంధనల పరిధికి లోబడేలా లోకల్ అసోసియేషన్, అధికారుల రిక్వైర్‌మెంట్స్ లేకపోవడంతో వేదికను అహ్మదాబాద్‌కు మార్చడం జరిగింది’ అని బీసీసీఐ పేర్కొంది. లీగ్ స్టేజ్ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌లో తలపడతాయి. తొలి రెండు స్థానాల్లోని జట్లు మొదటి క్వాలిఫయర్ ఆడతాయి. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన టీమ్‌కు మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో ఉండే జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. అందులో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టుతో ఎలిమినేటర్ విజేత ఢీ కొడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అక్కడ ఎవరైతే విజయం సాధిస్తారో ఐపీఎల్ 2026 కప్పు వారి సొంతమవుతుంది.


షెడ్యూల్..

  • క్వాలిఫయర్ 1: ధర్మశాల వేదికగా మే 26న

  • ఎలిమినేటర్: చండీగఢ్ వేదికగా మే 27న

  • క్వాలిఫయర్ 2: చండీగఢ్ వేదికగా మే 29న

  • ఫైనల్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 31న


ఇవి కూడా చదవండి:

నితీశ్ రాణా ఔట్‌పై సోషల్ మీడియాలో వార్.. అసలేం జరిగిదంటే.?

సంజు అద్భుత ఇన్నింగ్స్.. గావస్కర్ ఫిదా!

Updated Date - May 06 , 2026 | 02:28 PM