Share News

నితీశ్ రాణా ఔట్‌పై సోషల్ మీడియాలో వార్.. అసలేం జరిగిదంటే.?

ABN , Publish Date - May 06 , 2026 | 11:42 AM

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. మరోవైపు ఇదే మ్యాచ్‌లో ఓ వివాదం చోటుచేసుకుంది.

నితీశ్ రాణా ఔట్‌పై సోషల్ మీడియాలో వార్.. అసలేం జరిగిదంటే.?
nitish rana controversy

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026లో భాగంగా నిన్న(మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సంజు శాంసన్ 87 పరుగులతో సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో ఓ వివాదం చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీశ్ రాణా ఔటైన తీరు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...


టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు పాథుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్న పిచ్‌పై రాణా ఆచితూచి ఆడుతూ క్రీజులో నిలదొక్కునేలా కన్పించాడు. ఈ క్రమంలో 10 ఓవర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్‌లో మూడో బంతికి స్వీప్ షాట్ ఆడబోయి డీప్ ఫైన్ లెగ్ ఫీల్డర్‌కు రాణా చిక్కాడు.


రాణా బంతిని షాట్ ఆడే క్రమంలోనే ఒక్కసారిగా వికెట్లపై ఉన్న బెయిల్స్ కింద పడిపోయాయి. దీంతో నితీశ్ హిట్ వికెట్ అయ్యాడని అంతా భావించారు. అయితే బ్యాట్, బంతి తగలకుండానే బెయిల్స్ పడిపోయాయి. రిప్లేలో చూస్తే బలమైన గాలులు కారణంగా బెయిల్స్ కింద పడిపోయినట్లు స్పష్టమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నితీశ్ ఔట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్టంప్స్ కింద పడిపోయాయి కాబట్టి బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.


బ్యాటర్‌ దృష్టి మరల్చే విధంగా ఏదైనా అవాంతరం ఏర్పడినప్పుడు డెడ్‌బాల్‌గా అంపైర్‌గా ప్రకటిస్తారు. అంతేకాకుండా బంతి డెలివరీ అయ్యే ఆఖరి క్షణంలో బ్యాటర్ పక్కకు తప్పుకొన్న డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. కానీ రాణా మాత్రం ఎలాంటి ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా షాట్ ఆడాడు. అంతేకాకుండా బౌలర్ బంతిని విసిరిన తర్వాత బెయిల్స్ పడిపోయాయి. అందుకే అంపైర్లు దాన్ని డెడ్ బాల్‌గా పరిగణించలేదని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

సంజు అద్భుత ఇన్నింగ్స్.. గావస్కర్ ఫిదా!

తక్కువ ఫీజుతో క్రీడల్లో శిక్షణ

Updated Date - May 06 , 2026 | 11:52 AM