Share News

కోల్‌కతాలో టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. అర్ధరాత్రి బుల్డోజర్‌తో కూల్చివేత..

ABN , Publish Date - May 06 , 2026 | 11:20 AM

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కోల్‌కతాలోని ప్రసిద్ధ న్యూ మార్కెట్ ప్రాంతంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చివేయడం తీవ్ర కలకలం రేపింది.

కోల్‌కతాలో టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. అర్ధరాత్రి బుల్డోజర్‌తో కూల్చివేత..
TMC office demolished

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కోల్‌కతాలోని ప్రసిద్ధ న్యూ మార్కెట్ ప్రాంతంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చివేయడం తీవ్ర కలకలం రేపింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే హింసాత్మక ఘటనలు జరగడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. హాగ్ మార్కెట్ సమీపంలోని టీఎంసీ యూనియన్ కార్యాలయమే ప్రధాన లక్ష్యంగా ఈ దాడి జరిగింది (TMC office demolished).


టీఎంసీ యూనియన్ కార్యాలయం దగ్గరకు మంగళవారం అర్ధరాత్రి భారీ సంఖ్యలో చేరుకున్న కొందరు వ్యక్తులు బుల్డోజర్ సహాయంతో ఆ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేశారు (Kolkata New Market). అక్కడ బీజేపీ జెండాలు ఊపుతూ నినాదాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనతో న్యూ మార్కెట్ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాపారులు దుకాణాలను మూసివేసి వెళ్లిపోయారు. పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి భద్రతను కట్టుదిట్టం చేశారు.


ఈ ఘటనపై టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు (Bengal post poll violence). 'బెంగాల్‌లో బీజేపీ బుల్డోజర్‌తో మార్పు తీసుకొచ్చింది. వీధుల్లోకి వెళ్లి దాడులు చేసేందుకు బీజేపీ కార్యకర్తకలకు పార్టీ అధిష్ఠానం లైసెన్స్ ఇచ్చింది. ఈ రోజు దుకాణాలు, ఆఫీస్‌లను కూల్చుతున్నారు. రేపు రాజకీయ ప్రత్యుర్థులను కూల్చుతారేమో' అని టీఎంసీ మండిపడింది. కోల్‌కతాతో పాటు బెంగాల్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..


ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా

Updated Date - May 06 , 2026 | 11:26 AM