పుతిన్ బంకర్లలో దాక్కున్నారా.. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల భయంతోనేనా..
ABN , Publish Date - May 06 , 2026 | 10:49 AM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భయపడుతున్నారా? ఉక్రెయిన్ తనపై హత్యాయత్నానికి పాల్పడుతుందని భావిస్తున్నారా? ఆ భయంతోనే బంకర్లలో దాక్కున్నారా? అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భయపడుతున్నారా? ఉక్రెయిన్ తనపై హత్యాయత్నానికి పాల్పడుతుందని భావిస్తున్నారా? ఆ భయంతోనే బంకర్లలో దాక్కున్నారా? అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. హత్యాయత్నం జరుగుతుందనే భయాలు పెరగడంతో పుతిన్ చుట్టూ భద్రతను గణనీయంగా కట్టుదిట్టం చేసినట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' ఓ కథనం ప్రచురించింది (Vladimir Putin bunker).
పుతిన్ ఇప్పుడు తన సమయాన్ని ఎక్కువగా భూగర్భ బంకర్లలోనే గడుపుతున్నారని ఆయనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, యూరోపియన్ ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నట్టు 'ఫైనాన్షియల్ టైమ్స్' తెలిపింది. పౌర వ్యవహారాలలో చాలా తక్కువగా పాల్గొంటున్నారని సమాచారం. గత సంవత్సరం, ఉక్రెయిన్‌కు చెందిన డ్రోన్లు ఆర్కిటిక్ సర్కిల్‌కు ఆవల ఉన్న రష్యన్ ఎయిర్‌ఫీల్డ్‌లపై దాడి చేశాయి. ఈ నేపథ్యంలో పుతిన్ భద్రత గురించి క్రెమ్లిన్ ఆందోళన చెందుతోందని సమాచారం (Kremlin security).
పుతిన్ ఇటీవల తన పర్యటనలను తగ్గించుకున్నారని, ఆయనను వ్యక్తిగతంగా కలిసే వ్యక్తుల భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేశారని యూరోపియన్ ఇంటెలిజెన్స్‌కు సన్నిహితంగా ఉన్న వ్యక్తి తెలిపారు (Russia Ukraine war). వంటవాళ్లు, ఫొటోగ్రాఫర్లు, అంగరక్షకులు, ఇతర సిబ్బంది ప్రజా రవాణాను ఉపయోగించకుండా నిషేధించారు. పుతిన్ సమీపంలో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పరికరాలను కూడా నిషేధించారట. పుతిన్ సహాయకుల ఇళ్లలో భద్రతా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా