Share News

కోలుకున్న రూపాయి.. దేశీయ సూచీలకు లాభాలు..

ABN , Publish Date - May 06 , 2026 | 09:59 AM

ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరబోతోందని, హోర్ముజ్‌లో 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌'ను తాత్కాలికంగా ఆపేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సూచీలకు సానుకూలంగా మారింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కోలుకోవడం కలిసొచ్చింది.

కోలుకున్న రూపాయి.. దేశీయ సూచీలకు లాభాలు..
Stock Market

ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరబోతోందని, హోర్ముజ్‌లో 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌'ను తాత్కాలికంగా ఆపేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సూచీలకు సానుకూలంగా మారింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కోలుకోవడం కలిసొచ్చింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.08గా ఉంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (77,017)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల లాభంతో 77,424 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. అయితే ఆ తర్వాత ఆరంభ లాభాలను కోల్పోయింది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 313 పాయింట్ల లాభంతో 77,331 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 117 పాయింట్ల లాభంతో 24,150 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో కోఫోర్జ్, ఫోర్స్ మోటార్స్, ఎస్‌ఆర్‌ఎఫ్, యెస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). లార్సన్, హిటాచీ ఎనర్జీ, యునైటెడ్ స్పిరిట్స్, బ్లూ స్టార్, సీజీ పవర్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 607 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 638 పాయింట్ల లాభంతో ఉంది.


ఇవి కూడా చదవండి..

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..


ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా

Updated Date - May 06 , 2026 | 10:01 AM