పాకిస్థాన్ విజ్ఞప్తి వల్లే ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను తాత్కాలికంగా ఆపాం: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - May 06 , 2026 | 09:09 AM
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధిలో చేపట్టిన 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధిలో చేపట్టిన 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం పాకిస్థాన్ అభ్యర్థన మేరకు తీసుకున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్' ద్వారా ట్రంప్ వెల్లడించారు (Project Freedom).
ఇరాన్ ప్రతినిధులతో తుది ఒప్పందం దిశగా గొప్ప పురోగతి సాధించామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌తో శాంతి చర్చలకు అవకాశం కల్పించేందుకు కొద్దికాలం పాటు 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తెలిపారు. అయితే ఇరాన్‌పై అమల్లో ఉన్న నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేందుకు అమెరికా సైన్యం 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ప్రారంభించింది. దీనిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూఏఈపై దాడులు కూడా చేసింది. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది (Donald Trump Pak Request).
'పాకిస్థాన్, ఇతర దేశాల అభ్యర్థన మేరకు 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం (Strait of Hormuz). ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో అద్భుత సైనిక విజయం సాధించాం. ఇరాన్ ప్రతినిధులతో సంపూర్ణ, తుది ఒప్పందం దిశగా గొప్ప పురోగతి సాధించినందున, 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను కొద్దికాలం పాటు నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం. అయితే దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది' అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా