Share News

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

ABN , Publish Date - May 06 , 2026 | 06:32 AM

తాజాగా రూ.1.5 లక్షల మార్క్ దిగువకు వచ్చిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తాజాగా మరింత కిందకు దిగి వచ్చింది. బంగారం కొనాలనుకునే వారికి కాస్తంత ఊరట కలిగిస్తోంది.

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
gold and silver rates today

ఇటీవల రూ.1.5 లక్షల మార్క్ దిగువకు వచ్చిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తాజాగా మరింత కిందకు దిగి వచ్చింది. బంగారం కొనాలనుకునే వారికి కాస్తంత ఊరట కలిగిస్తోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి (Gold and Silver Rates).


గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,170గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,36,740గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,220గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,36,890గా ఉంది (Live Gold Rates).


మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గుదల నమోదు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,64,900గా, బెంగళూరులో రూ.2,54,900గా ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవీ చదవండి:

యూఏఈపై ఇరాన్ డ్రోన్ దాడి.. ముగ్గురు భారతీయులకు గాయాలు..

ప్రాజెక్ట్ ఫ్రీడమ్.. హోర్ముజ్‌లో రక్షణ కోసం డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్..

Updated Date - May 06 , 2026 | 06:32 AM