Share News

యూఏఈపై ఇరాన్ డ్రోన్ దాడి.. ముగ్గురు భారతీయులకు గాయాలు..

ABN , Publish Date - May 05 , 2026 | 08:49 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడి ఆందోళన కలిగిస్తోంది. ఫుజైరాలోని చమురు నిల్వ కేంద్రం, ఇండస్ట్రియల్ జోన్‌పై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది.

యూఏఈపై ఇరాన్ డ్రోన్ దాడి.. ముగ్గురు భారతీయులకు గాయాలు..
Iran drone attack UAE

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడి ఆందోళన కలిగిస్తోంది. ఫుజైరాలోని చమురు నిల్వ కేంద్రం, ఇండస్ట్రియల్ జోన్‌పై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడి కారణంగా అక్కడ భారీగా మంటలు చెలరేగాయి (Iran drone attack UAE).


ఇరాన్ చేసిన ఈ దాడి కారణంగా ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. అయితే వీరికి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు దిగడం ఇదే తొలిసారి. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలే ఈ దాడికి కారణంగా కనిపిస్తోంది. హోర్ముజ్ జలసంధిలో నౌకలకు రక్షణ కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ప్రారంభించారు (Indians injured UAE).


తమ 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' కారణంగా సోమవారం రెండు వాణిజ్య నౌకలు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్టు అమెరికా సైన్యం ప్రకటించింది (Iran UAE tensions). దానిని ఇరాన్ ఖండించింది. తమ అనుమతి లేకుండా ఓ అమెరికా నౌక జలసంధి దాటడానికి ప్రయత్నించిందని, దానిపై క్షిపణులతో దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ప్రకటనను అమెరికా ఖండించింది. తమ నౌకలపై ఎలాంటి దాడులూ జరగలేదని వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.1.5 లక్షల మార్క్ దిగువకు బంగారం ధరలు..


కమల్ హాసన్, రజనీకాంత్‌కు సాధ్యం కానిది.. విజయ్‌కు ఎలా సాధ్యమైంది?

Updated Date - May 05 , 2026 | 08:49 AM