ప్రాజెక్ట్ ఫ్రీడమ్.. హోర్ముజ్‌లో రక్షణ కోసం డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్..
ABN , Publish Date - May 04 , 2026 | 08:47 AM
ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' పేరుతో కొత్త చర్యలు తీసుకుంటామని, హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలకు అమెరికా రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ జలసంధిని ఇరాన్ మూసేసింది (Project Freedom).
హోర్ముజ్ జలసంధిని మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ప్రకటించారు. యుద్ధంలో భాగం కాని చాలా దేశాల నౌకలు హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయాయని, వాటిని విడిపించుకోవడం కోసం ఆయా దేశాలు అమెరికా సహాయం కోరాయని ట్రంప్ పేర్కొన్నారు. ఆ నౌకలు హోర్ముజ్ నుంచి సురక్షితంగా బయటపడేందుకు అమెరికా సాయం చేస్తుందన్నారు (Strait of Hormuz).
ఆయా నౌకలకు అమెరికా బలగాలు మార్గనిర్దేశనం చేస్తాయని ట్రంప్ తెలిపారు (US Navy Protection). పశ్చిమాసియా కాలమానం ప్రకారం, సోమవారం ఉదయం నుంచి 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ప్రారంభవుతుందని ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రక్రియను ఓ మానవతా చర్యగా ట్రంప్ అభివర్ణించారు. తాము మానవతా దృక్పథంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే.. దానిని బలప్రయోగంతో ఎదుర్కొంటామని ట్రంప్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
కాసేపట్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపు..