తక్కువ ఫీజుతో క్రీడల్లో శిక్షణ
ABN , Publish Date - May 06 , 2026 | 09:19 AM
తక్కువ ఫీజుతో ఆయా క్రీడల్లో తర్ఫీదు ఇచ్చేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తోంది.
కేవీబీఎస్లో వేసవి శిబిరం ప్రారంభం
హైదరాబాద్: తక్కువ ఫీజుతో ఆయా క్రీడల్లో తర్ఫీదు ఇచ్చేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో 45 రోజులపాటు నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాన్ని ఏప్రిల్ 24న ప్రారంభించింది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7గంటల వరకు కోచ్‌లు అందుబాటులో ఉంటున్నారు. ఈ శిబిరానికి తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఒక్కో క్రీడలో 50 నుంచి 60 మందికిపైగా విద్యార్థులు ఇప్పటికే శిక్షణ తీసుకుంటున్నారు.
ఆటలకు ఫీజుల వివరాలు ఇలా..
బాస్కెట్ బాల్ రూ.2వేలు, బ్యాడ్మింటన్ రూ.2,500, కరాటే రూ.500, కుస్తీ రూ.500, స్కేటింగ్ రూ. 2 వేలు, బాక్సింగ్ 500, జిమ్నాస్టిక్ 500, టేబుల్ టెన్నిస్ రూ.2వేలు(ఈ ఆటకు కోచ్ అందుబాటులో లేడు). పిల్లలను స్టేడియానికి తీసుకొస్తున్న తల్లిదండ్రుల కోసం స్పోర్ట్స్ అథారిటీ యోగా, జుంబ డ్యాన్స్, మ్యూజిక్ డ్యాన్స్‌లను అందుబాటులో ఉంచింది.
10 వరకు అడ్మిషన్
బాస్కెట్‌బాల్‌లో ఇప్పటి వరకు 58 మంది చిన్నారులు అడ్మిషన్ తీసుకున్నారు. బాల్ బ్యాడ్మింటన్‌లో 64 మంది చేరారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 10 వరకు ఆయా రంగాల్లో అడ్మిషన్‌లు తీసుకోవచ్చు. బాస్కెట్ బాల్ ఆటతో శారీరీక దృఢత్వం వస్తుంది.
- సోహెల్ ఖాన్, బాస్కెట్‌బాల్ కోచ్
అనుకూలంగా ఫీజు
స్కేటింగ్‌లో ఇప్పటి వరకు 35 మంది చిన్నారులు చేరారు. విశాలమైన స్కేటింగ్ క్రీడా మైదానం అందుబాటులో ఉంది. సమ్మర్ బ్యాచ్‌తోపాటు రెగ్యులర్‌గా నడిచే బ్యాచ్‌లు ఉన్నాయి. కె.వి.బి.ఎస్‌లో కోర్సు ఫీజు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంది.
- ఎంఏ ఖదీర్, స్కేటింగ్ కోచ్
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
ఆగని అవినీతి.. రేటు కట్టి పౌర సేవలు
Read Latest Telangana News and National News