జైశ్రీరామ్ అంటే పైనుంచి పైసలు పడుతున్నాయా?
ABN , Publish Date - May 06 , 2026 | 07:41 AM
రాష్ట్రానికి ఎలాంటి నిధులు, పథకాలు ఇవ్వని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ ప్రభుత్వాని విమర్శించే హక్కు లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు.
రాష్ట్రానికి ఏమైనా పథకాలు వస్తున్నాయా?
కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిధులేమీ ఇవ్వడంలేదు
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు
హనుమకొండ, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఎలాంటి నిధులు, పథకాలు ఇవ్వని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ ప్రభుత్వాని విమర్శించే హక్కు లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మెగా రైతు మేళలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. బీజేపీపై వ్యంగ్య వాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ వాళ్లు మీటింగ్‌లు పెట్టుడు జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అనుడు.. మరి జై శ్రీరామ్ అంటే పై నుంచి ఏమైనా పైసలు పడుతున్నాయా? లేకపోతే మనకు ఏమైనా పథకాలు వస్తున్నాయా ? ఇంకేమైనా వస్తున్నాయా అంటే ఏమీ లేవు. ఏడాది కోసారి మోదీని తీసుకువస్తరు.. ఓ మీటింగ్ పెడతరు.. నాలుగు మాటలు హిందీల మాట్లాడిస్తరు.. ఎళ్లకొడతరు. ఇక్కడ ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు సప్పుడు చేయరు.. ఇక్కడ ఉన్న జిల్లా అఽధ్యక్షుడు కూడా సప్పుడు చేయడు.. కేంద్రం నుంచి రావలసినవి మనకు ఏమైతే ఉన్నయో.. వాటికి సంబంధించి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరుమూసుకొని కూర్చుంటారు’’ అని మంత్రి సురేఖ విమర్శించారు.