Share News

భారత్ దేనినీ క్షమించదు.. ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీడియో..

ABN , Publish Date - May 07 , 2026 | 08:44 AM

ఆపరేషన్ సిందూర్‌ మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా భారత వైమానిక దళం (IAF) ఓ శక్తివంతమైన వీడియోను విడుదల చేసింది. 'భారత్ దేనినీ క్షమించదు' అనే సందేశంతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారత్ దేనినీ క్షమించదు.. ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీడియో..
Operation Sindoor anniversary

ఆపరేషన్ సిందూర్‌ మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా భారత వైమానిక దళం (IAF) ఓ శక్తివంతమైన వీడియోను విడుదల చేసింది. 'భారత్ దేనినీ క్షమించదు' అనే సందేశంతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారత్ నిర్వహించిన వైమానిక దాడులు, పేలుళ్లు, సైనిక సామర్థ్యాన్ని చూపించారు (Operation Sindoor anniversary).


'భారత్ ఏదీ మర్చిపోలేదు.. దేనినీ క్షమించదు' అంటూ ఐఏ‌ఎఫ్ తాజా వీడియోలో పేర్కొంది. 'ప్రతి ఉగ్రవాదిని, వారికి అండగా నిలిచిన వారిని భారత్ వెంబడించి, శిక్షిస్తుంది' అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన వార్నింగ్‌ కూడా తాజా వీడియోలో కనబడుతోంది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది (Indian Air Force video).


2025 మే 7న భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక వసతులపై భారీ దాడులు నిర్వహించింది (India forgives nothing). పాక్‌లోని లక్ష్యాలపై బ్రహ్మోస్ క్షిపణుల దాడులు, భారత సైన్యం ప్రణాళిక, దళాల సమీకరణ, ఉగ్రవాద శిబిరాలపై దాడులు, భారీ పేలుళ్లు తాజా వీడియోలో కనిపించాయి. భారత భద్రతకు ముప్పు కలిగించే చర్యలపై ఇకపై మరింత కఠిన వైఖరి కొనసాగుతుందనే సంకేతాన్ని ఈ వీడియో ద్వారా ఐఏఎఫ్ పునరుద్ఘాటించింది.


ఇవి కూడా చదవండి..

భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి


పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Updated Date - May 07 , 2026 | 09:11 AM