భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి
ABN , Publish Date - May 07 , 2026 | 07:32 AM
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. భవిష్యత్తులో భారత్ నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ మరింత తీవ్రంగా, నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని హెచ్చరించారు.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి భారత్‌పై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. భవిష్యత్తులో భారత్ నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ మరింత తీవ్రంగా, నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని హెచ్చరించారు. పాక్‌పై భారత్ దాడులు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది (Operation Sindoor).
రెండు దేశాల మధ్య నాలుగు రోజులపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు మే 10న సైనిక చర్యలను నిలిపివేయాలనే అవగాహనకు రెండు దేశాలు వచ్చాయి. 'పాకిస్థాన్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. అలాగే తన గౌరవం, భద్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో రాజీ పడదు. భవిష్యత్తులో భారత్ నుంచి ఎలాంటి సాహసోపేత చర్య జరిగినా పాకిస్థాన్ స్పందన మరింత తీవ్రంగా ఉంటుంది' అని ఖవాజా హెచ్చరించారు (Pakistan warning to India).
'గాలి, భూమి, సముద్ర మార్గాల్లో జరిగే దాడుల్ని తిప్పికొట్టగలిగే సామర్థ్యాలను పాకిస్థాన్ గణనీయంగా పెంచుకుంది' అని ఆసిఫ్ పేర్కొన్నారు (India Pakistan conflict). ఇటీవలి కాలంలో ఆసిఫ్ పలుసార్లు భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. భారత్ తమపై దాడికి దిగితే కోల్‌కతా నగరంపై కూడా పాక్ దాడి చేయగలదని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన ఉగ్రవాదులకు సైనిక అంత్యక్రియలు.. పాక్ నేత సంచలన వ్యాఖ్యలు..
పుతిన్ బంకర్లలో దాక్కున్నారా.. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల భయంతోనేనా..