ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన ఉగ్రవాదులకు సైనిక అంత్యక్రియలు.. పాక్ నేత సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - May 06 , 2026 | 01:46 PM
గతేడాది భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'లో హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని పాక్ నేత షహీర్ సియాల్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. నజ్రియాతీ పార్టీ చైర్మన్ అయిన షహీర్ సియాల్వి, తాజాగా లష్కరే తోయిబా నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.
గతేడాది భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'లో హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని పాక్ నేత షహీర్ సియాల్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. నజ్రియాతీ పార్టీ చైర్మన్ అయిన షహీర్ సియాల్వి, తాజాగా లష్కరే తోయిబా నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులకు, దేశ సైన్యానికి మధ్య ఉన్న బంధాన్ని ఒక ప్రముఖ పాక్ నాయకుడు బహిరంగంగా ధ్రువీకరించడం ఇదే మొదటిసారి (Operation Sindoor).
సియాల్వి వ్యాఖ్యల ప్రకారం.. పాకిస్థాన్ సైన్యం స్వయంగా ఉగ్రవాదుల మృతదేహాలకు సైనిక వందనాలు సమర్పించింది (Shaheer Sialvi statement). యూనిఫార్మ్ ధరించిన సైనికులు ఆ ఉగ్రవాదుల శవపేటికలను మోశారు. 'మురీద్‌కే, బహావల్పూర్ ప్రాంతాలపై భారత్ దాడి చేసింది. భారత్ ఈ ప్రాంతాలను ఉగ్రవాద శిబిరాలుగా ప్రపంచానికి చూపించింది. అయితే అక్కడ చనిపోయిన వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా ప్రపంచానికి చూపించాలని పాక్ అనుకుంది. అందుకే ఆర్మీ ముందుకు వచ్చింది' అని సియాల్వి వ్యాఖ్యానించారు.
సియాల్వి ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Pakistan terrorism). ఆ వీడియోలో, ఉగ్రవాది హాఫిజ్ సయీద్‌కు సన్నిహితుడైన సీనియర్ లష్కర్ కమాండర్ ముజమ్మిల్ హష్మీ.. సియాల్వికి కుడివైపున కూర్చుని కనిపిస్తున్నాడు. తమ భూభాగం నుంచి పని చేస్తున్న ఉగ్రవాదులకు ప్రభుత్వం కాని, సైన్యం కాని మద్దతు ఇవ్వడం లేదని పాక్ పదే పదే చెబుతోంది. అయితే పాక్ నేతల వ్యాఖ్యలు, వారి చర్యలు మాత్రం అసలు విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా