Share News

జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టులో రిట్ పిటిషన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు..

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:07 PM

జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంపై తెలంగాణ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. జీవో నంబర్ 55ను సవాల్ చేస్తూ కోర్టులో గురువారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు..

జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టులో రిట్ పిటిషన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు..
Telangana High Court

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంపై తెలంగాణ కోర్టులో (Telangana High Court) రిట్ పిటిషన్ దాఖలైంది. జీవో నంబర్ 55ను సవాల్ చేస్తూ కోర్టులో గురువారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ(గురువారం) విచారణ చేపట్టింది. 2027 జనగణన నేపథ్యంలో రిజిస్ట్రార్ జనరల్, సెన్స స్ కమిషనర్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ నంబర్ -01 ప్రకారం.. జ్యూరీ డిస్టింక్షన్ ఫ్రీజ్ అమల్లో ఉందని పిటిషనర్ వాదనలు వినిపించారు.


మున్సిపల్ సరిహద్దులు మార్చడం, స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణ చట్ట విరుద్ధమని పిటిషనర్ తెలిపారు. జీవో నంబర్ 55ను రద్దు చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేసింది. పిటిషనర్ వాదనలు విన్న అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రెండు ప్రభుత్వాలనూ ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు

మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 04:45 PM