Share News

పెద్ది మూవీ టికెట్ ధరల వ్యవహారం.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్

ABN , Publish Date - Jun 10 , 2026 | 07:08 PM

తెలంగాణలో ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.ఈ సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ ధరలను 10 రోజుల పాటు పెంచుకునేందుకు ఈ నెల 2వ తేదీన హోంశాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పెద్ది మూవీ టికెట్ ధరల వ్యవహారం.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్
Telangana High Court

హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ ధరలను 10 రోజుల పాటు పెంచుకునేందుకు ఈ నెల 2వ తేదీన హోంశాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హోంశాఖ అనుమతి ఉందని పేర్కొంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు.


విచారణ సందర్భంగా టికెట్ ధరల పెంపు విషయంలో హోంశాఖ జారీ చేసిన మెమో చట్టబద్ధతపై హైకోర్టు ప్రశ్నించింది. టికెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వం జీఓ నంబర్-121 నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని గతంలో కోర్టు స్పష్టం చేసినట్లు గుర్తు చేసింది. కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి మెమో జారీ చేశారని ఆరోపిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైనట్లు న్యాయవర్గాలు తెలిపాయి.


ఈ కేసుపై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది (జీపీ) హోంశాఖ నుంచి పూర్తి వివరాలు సేకరించడానికి కొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు న్యాయ, రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు తదుపరి విచారణలో తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 07:17 PM