తెలంగాణ టెన్త్ పరీక్షల రద్దుపై విద్యా కమిషన్ స్పష్టత
ABN , Publish Date - Mar 20 , 2026 | 09:23 PM
తెలంగాణలో పదవ తరగతి బోర్డు పరీక్షలు రద్దు కాబోతున్నాయంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర విద్యా కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఈ విషయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపింది.
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పదోతరగతి (SSC) బోర్డు పరీక్షల రద్దు వార్తలు ప్రచారమవుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్ స్పష్టత ఇచ్చారు. ఇంతవరకు పదోతరగతి పరీక్షలు రద్దు చేయమని ఎక్కడా సిఫార్సు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కేవలం 11వ తరగతి (ఇంటర్ ఫస్ట్ ఇయర్) పబ్లిక్ పరీక్షల రద్దుకు మాత్రమే ప్రతిపాదన వచ్చిందని తెలిపారు.
టెన్త్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఎక్కడా సిఫార్సు చేయలేదన్నారు. కేవలం 11వ తరగతి (ఇంటర్ ఫస్ట్ ఇయర్) పబ్లిక్ పరీక్షల రద్దుకే ప్రతిపాదన చేసినట్లు వివరించారు. SSC బోర్డు, ఇంటర్ బోర్డు (BIE) విలీనానికి కమిషన్ సిఫార్సు చేసిందని ప్రస్తావించారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని.. అధికారిక సమాచారాన్నే నమ్మాలని విద్యా కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్ సూచించారు.
పది పరీక్షలపై సీఎం రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..
అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ మీడియా మీట్‌లో పదోతరగతి పరీక్షల గురించి మాట్లాడారు. ఇకపై పదోతరగతి పరీక్షలు లేనట్లే అని స్పష్టం చేశారు. దేశమంతా +2 విధానం అమల్లో ఉందని, తెలంగాణలో కూడా పదోతరగతి పరీక్షల సవరణ విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విప్‌ల నియామకం..
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత నాది: తుమ్మల నాగేశ్వరరావు
Read Latest Telangana News And AP News And International News And Telugu News