Home » Tenth Exams
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో 580కి పైగా మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించేందుకు చర్యలు ప్రారంభించారు.
రాష్ట్ర విద్యాశాఖలోని విప్లవాత్మక మార్పుల ప్రభావం.. తాజా పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం గ్లోబల్ స్థాయిలో పోటీ పడే సత్తాను సాధించారని ప్రశంసించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి ఒడియా మాధ్యమంలో చదివి ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కు లు సాధించిన ఆంధ్రప్రదేశ్ ఒఇయా టీచర్స్ అసోసియేషన్ (అపోటా) ఆధ్వర్యంలో అభినం దించారు.
తెలంగాణలో పదవ తరగతి బోర్డు పరీక్షలు రద్దు కాబోతున్నాయంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర విద్యా కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఈ విషయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపింది.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు అదే స్కూల్‌ను పరీక్షా కేంద్రంగా కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయాన్ని బయటికి రాకుండా డీఈవో రహస్యంగా ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. ఒక వైపు కన్నతండ్రి భౌతికకాయం ఇంట్లో ఉండగానే.. మరోవైపు తన భవిష్యత్తు కోసం ఆ విద్యార్థి కన్నీటి పర్యంతమవుతూ పదోతరగతి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు, ఉపాధ్యాయులు కంటతడి పెట్టారు.
ఒంగోలు జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. పరీక్షల్లో పొరపాటున చిన్న తప్పుచేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సరైన ప్రశ్నపత్రం తీసుకొని జవాబు రాయాల్సిన బాధ్యత విద్యార్థిదే.
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని విద్యాశాఖ కల్పించింది. 9552300009 నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేసి హాల్ టికెట్‌ను సులభంగా పొందవచ్చు.
ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్‌టికెట్లను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ గురువారం విడుదల చేయనున్నారు. జిల్లాలో 145 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్థి దశలో కీలకమైన ఘట్టం పదోతరగతి పరీక్షలు. మార్చి 16వ తేదీ నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలయింది.