Share News

విద్యార్థులూ బహుపరాక్‌..

ABN , Publish Date - Mar 11 , 2026 | 08:18 AM

ఒంగోలు జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. పరీక్షల్లో పొరపాటున చిన్న తప్పుచేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సరైన ప్రశ్నపత్రం తీసుకొని జవాబు రాయాల్సిన బాధ్యత విద్యార్థిదే.

విద్యార్థులూ బహుపరాక్‌..
AP SSC Exams

  • పదో తరగతి పరీక్షల్లో చిన్న తప్పుచేసినా భారీ మూల్యం

ఒంగోలు విద్య, మార్చి 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు (AP SSC Exams) హాజరవుతున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. పరీక్షల్లో పొరపాటున చిన్న తప్పుచేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సరైన ప్రశ్నపత్రం తీసుకొని జవాబు రాయాల్సిన బాధ్యత విద్యార్థిదే. జవాబుపత్రంపైన గ్రాఫ్‌, మ్యాప్‌పై కానీ హాల్‌ టికెట్‌ నెంబరు వేయ కూడదు. నెంబరు వేసిన జవాబుపత్రాలను మాల్‌ప్రాక్టీసు కింద పరిగణించి మూల్యాంకనం చేయరు. విద్యార్థులకు పరీక్ష హాలులో ఇచ్చే 24పేజీలు, 12పేజీల జవాబు పత్రాలపై తప్పనిసరిగా క్రమ సంఖ్య ముద్రించి ఉండాలి. క్రమసంఖ్య లేని జవాబు పత్రాలను తిరిగి ఇన్విజిలేటర్‌కు ఇచ్చి క్రమ సంఖ్యగల జవాబు పత్రాన్ని తీసుకోవాలి.


విద్యార్థులకు సూచనలివే..

  • విద్యార్థులు సమాధానాలు నీలం, లేదా నలుపు రంగు బాల్‌పాయింట్‌ పెన్నుతోనే రాయాలి. ఇతర రంగుల పెన్నులు ఉపయోగించరాదు.

  • జవాబుపత్రంపై ఎటువంటి నిషేధిత, అసభ్య పదజాలాన్ని ఉపయోగించరాదు. అలా చేస్తే మూల్యంకనం చేయరు.

  • విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రంలోనే పరీక్షకు హాజరుకావాలి. ఇతర కేంద్రాల్లో పరీక్ష రాస్తే దానిని రద్దుచేస్తారు.

  • విద్యార్థులు తమకు కేటాయించిన సబ్జెక్టు ప్రశ్నపత్రాలు కాకుండా ఇతర జవాబులు రాస్తే వాటిని రద్దుచేస్తారు.

  • ఏపీ ఓపెన్‌ స్కూలు సొసైటీ పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

  • గణితం పరీక్షల్లో గ్రాఫ్‌ను, సోషల్‌ పరీక్షలో మ్యాప్‌ను జాగ్రత్తగా సమాధాన పత్రానికి దారంతో కట్టి ఇన్విజిలెటర్‌కు అందజేయాలి.

  • పరీక్షా కేంద్రంలో విద్యార్థులు అప్పటికప్పుడు తమకు కేటాయించిన సబ్జెక్టులను మార్చుకునేందుకు అనుమతించరు. పాఠశాల విద్య కమిషనర్‌ లేదా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ అనుమతి లేకుండా విద్యార్థులు సబ్జెక్టులు మార్చుకునేందుకు అనుమతించరు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం

జగన్ హయాంలో ఐదేళ్లపాటు చెత్తపాలన సాగించారు.. మంత్రి నారాయణ ధ్వజం

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 08:21 AM