విద్యాశాఖ నిర్లక్ష్యం.. 80 మంది విద్యార్థులకు అదే స్కూల్‌లో ఎగ్జామ్ సెంటర్
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:49 PM
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు అదే స్కూల్‌ను పరీక్షా కేంద్రంగా కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయాన్ని బయటికి రాకుండా డీఈవో రహస్యంగా ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్, మార్చి 14: పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి న్యూ ఎరా స్కూల్‌లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే స్కూల్‌ను పరీక్షా కేంద్రంగా కేటాయించడం వివాదంగా మారింది. సాధారణంగా విద్యార్థులు తమ స్కూల్ నుంచి వివిధ కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. కానీ న్యూ ఎరా స్కూల్ విద్యార్థులకు మాత్రం అదే స్కూల్‌లో కేంద్రం ఏర్పాటు చేయడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది.
ఈ విషయాన్ని బయటికి రాకుండా డీఈవో రహస్యంగా ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. హాల్ టికెట్‌లను ఎవరికీ చూపించకూడదని విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఆదేశించినట్లు తెలుస్తోంది. మార్కులు పెంచుకోవడం కోసం విద్యాశాఖ అధికారులతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కుమ్మక్కయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని డీఈవో చెప్పుకొచ్చారు. ‘టెక్నికల్ ఇష్యూ కారణంగా అదే స్కూల్‌లో విద్యార్థులకు పరీక్షా కేంద్రంగా వచ్చింది’ అని డీఈవో క్లారిటీ ఇచ్చారు. ఆ స్కూల్‌లో పనిచేసే స్టాఫ్‌ను పూర్తిగా మార్చినట్లు తెలిపారు. మరో స్కూల్‌లో పని చేసే సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు విద్యాశాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే
Read Latest Telangana News And Telugu News