Share News

పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన

ABN , Publish Date - May 04 , 2026 | 12:10 AM

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఒడియా మాధ్యమంలో చదివి ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కు లు సాధించిన ఆంధ్రప్రదేశ్‌ ఒఇయా టీచర్స్‌ అసోసియేషన్‌ (అపోటా) ఆధ్వర్యంలో అభినం దించారు.

 పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన
విద్యార్థులను సత్కరిస్తున్న అపోటా ప్రతినిధులు

సత్కరించిన అపోటా సంఘ నేతలు

సోంపేట, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఒడియా మాధ్యమంలో చదివి ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కు లు సాధించిన ఆంధ్రప్రదేశ్‌ ఒఇయా టీచర్స్‌ అసోసియేషన్‌ (అపోటా) ఆధ్వర్యంలో అభినం దించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అపోటా రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌ పాడి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఒడియా విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్త కాలు అందించడంతో పాటు సబ్జెక్ట్‌ టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో అకాడమిక్‌ ఇన్‌స్ట్ట్రక్టర్‌లను నియమించి ఒడియా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒడియా ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలుస్తుండడం అభినందనీయ మన్నా రు. అనంతరం మంచి మార్కులు సాధించిన నందిని మహారాణ (590) (ఇచ్ఛాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల), జాష్మినీ బిశ్వాల్‌ (590) (మందస మండలం చిన్నకోష్ట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల), ధనుష్‌ బెహరా (589) (కృష్ణాపురం ఒడియా ఉన్నత పాఠశాల), సంపద గౌడ(589) కార్తీక్‌ గౌడ (588) (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల)లను సత్కరించారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వక్తలు ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఒడియా డీఐ దుర్గాప్రసాద్‌ చౌదరి, లింగ్విస్టిక్‌ మైనారిటీ అధ్య క్షుడు సత్యనారాయణ పాడి, కంచిలి ఎంఈవో ఎస్‌.శివరాంప్రసాద్‌, అపోటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బృందావన్‌ దొళాయి, పురేంద్ర బిసాయి, ఎస్‌.వెంకటరావు, కృష్ణచంద్ర మహంతి, ఎం. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 12:12 AM