Share News

నేడు పదోతరగతి హాల్‌టికెట్ల విడుదల

ABN , Publish Date - Mar 05 , 2026 | 08:14 AM

ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్‌టికెట్లను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ గురువారం విడుదల చేయనున్నారు. జిల్లాలో 145 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

నేడు పదోతరగతి హాల్‌టికెట్ల విడుదల
AP SSC Hall Tickets

నరసన్నపేట, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు (SSC Public Exams) సంబంధించి విద్యార్థుల హాల్‌టికెట్లను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ గురువారం విడుదల చేయనున్నారు. జిల్లాలో 145 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే రెగ్యులర్‌ విద్యార్థులు 28,524 మంది, సప్లిమెంటరీ పరీక్షలకు 898 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు తమ హాల్‌ టిక్కెట్లను డీజీఈ కార్యాలయ అధికారిక వెబ్‌సైట్‌, వాట్సాప్‌ సేవ, మనమిత్ర యాప్‌ (9552300009), లీప్‌ యాప్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. విద్యార్థులు ఇతర అనధికార వెబ్‌సైట్లను నమ్మకుండా కేవలం అధికారికంగా ప్రకటించిన వెబ్‌సైట్‌ల నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని హెచ్‌ఎంలు విద్యార్థులకు తెలియజేసి హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డీఈవో రవిబాబు ఒక ప్రకటనలో సూచించారు.


గతంలో ఒక్క హిందీ సబ్జెక్టుకు మినహా ఇతర సబ్జెక్టులన్నింటికీ రెండేసి పేపర్లకు పరీక్ష నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికారు. ఒక్క జనరల్‌ సైన్స్‌ మినహా ఇతర సబ్జెక్టులంటికీ ఒక్క పేపరు 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్‌ సైన్స్‌లో మాత్రం ఫిజకల్‌ సైన్స్‌ 50 మార్కులు, బయాలాజికల్‌ సైన్స్‌ 50 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈనెల 16న ప్రథమ భాష తెలుగు పార్ట్‌ఏ, ప్రథమ భాష పేపర్‌-1, కాంపోజిట్‌కోర్సు, 18న హిందీ, 21న ఇంగ్లీషు, 23న గణితం, 25న ఫిజికల్‌ సైన్స్‌, 28న బయాలాజికల్‌ సైన్స్‌, 30న సోషల్‌, 31న ప్రథమ భాష పేపర్‌-2, కాంపోజిట్‌ కోర్సు, ఓఎస్‌ఎస్‌సీ, మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజి పేపర్‌-2 , ఒకేషనల్‌ పరీక్షలు జరగనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 08:21 AM