Share News

తండ్రి మరణం... కన్నీటితో పది పరీక్ష రాసిన కొడుకు

ABN , Publish Date - Mar 14 , 2026 | 10:52 AM

మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. ఒక వైపు కన్నతండ్రి భౌతికకాయం ఇంట్లో ఉండగానే.. మరోవైపు తన భవిష్యత్తు కోసం ఆ విద్యార్థి కన్నీటి పర్యంతమవుతూ పదోతరగతి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు, ఉపాధ్యాయులు కంటతడి పెట్టారు.

తండ్రి మరణం... కన్నీటితో పది పరీక్ష రాసిన కొడుకు
Medak incident

మెదక్ జిల్లా, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామశివారులో నిన్న(శనివారం) అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో పాంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు మృతిచెందారు. నాగరాజుకు ఈరోజు అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయితే ఈ దు:ఖాన్ని దిగమింగుకొని ఆయన కొడుకు ధనుశ్ పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు. ఈ విషాదకర సంఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. తండ్రి మరణించిన పుట్టెడు దు:ఖంలో కూడా, తన భవిష్యత్తు కోసం కన్నీళ్లతో పరీక్షా కేంద్రానికి వచ్చిన ఆ విద్యార్థి.. తన సహచర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు తెలిపారు.


కాటేసిన మృత్యువు..

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) నిన్న (శనివారం) అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఉసిరికపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో నాగరాజు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుమారుడు పుట్టెడు దు:ఖంలో పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు.


గుండెల్లో బాధను దాచుకుని..

ఇంటి వద్ద తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా, తండ్రి కలలను నిజం చేయాలనే పట్టుదలతో ధనుశ్ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు. తండ్రిని కోల్పోయిన బాధను గుండెల్లో దాచుకుని, కళ్లలో నీరు తిరుగుతుండగా ధనుశ్ పదోతరగతి పరీక్షకు హాజరయ్యారు. తండ్రి మరణించినా ధైర్యం కోల్పోకుండా పరీక్షకు హాజరైన ధనుశ్‌ను చూసి గ్రామస్థులు చలించిపోయారు. ‘ఎంత కష్టమొచ్చినా చదువును వదల్లేదు’ అంటూ ధనుశ్‌ను ఓదార్చారు. అధికారులు, ఉపాధ్యాయులు కూడా ధనుశ్‌కు ధైర్యం చెప్పారు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన నాగరాజు.. తన కొడుకును గొప్పగా చదివించాలని కలలు కనేవారని స్థానికులు తెలిపారు. ఆ కల కోసం ధనుశ్ కన్నీటితో పరీక్ష రాయడం..ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్

గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం.. మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం

టూరిస్ట్ బస్సు బోల్తా.. నలుగురి మృతి

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 14 , 2026 | 11:39 AM