మనమిత్ర ద్వారా పదో తరగతి హాల్ టికెట్స్
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:30 PM
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని విద్యాశాఖ కల్పించింది. 9552300009 నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేసి హాల్ టికెట్‌ను సులభంగా పొందవచ్చు.
అమరావతి, మార్చి 5: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి హాల్ టికెట్లు(AP 10th Class Hall Ticket) ఈరోజు(గురువారం) విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు (10th Exams) ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులు సులభంగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని విద్యాశాఖ కల్పించింది.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ విధానం..
మొదట 9552300009 నెంబరును మీ వాట్సాప్‌లో సేవ్ చేసుకోవాలి.
వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నెంబరుకు ‘హాయ్’ అని మెసేజ్ చేయాలి
మెనూలో ఎడ్యుకేషన్ సేవలు ఎంపిక చేసుకోవాలి
అప్పుడు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి
మీ పుట్టిన తేదీ/అడ్మిషన్ నెంబర్/ పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్(PEN) వీటిలో ఏదో ఒక్కటి అక్కడ టైప్ చేయాలి
మీ హాల్ టికెట్ పీడీఎఫ్ వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి.
దీని ద్వారా విద్యార్థులు ఇంటి నుంచే సులభంగా హాల్ టికెట్‌ను పొందవచ్చు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీజీఎస్ కోరింది.
ఇవి కూడా చదవండి...
బిహార్ సీఎం సంచలన ప్రకటన.. నేడే రాజ్యసభకు నామినేషన్!
రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News