Share News

టీచర్‌పై విద్యార్థి దాడి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:20 PM

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో విద్యార్థి, నాన్‌ టీచింగ్ స్టాఫ్‌కు మధ్య గొడవ జరిగింది. ఓ విద్యార్థి తల్లిని నాన్ టీచింగ్ స్టాఫ్ దుర్భాషలాడడంతో ఘర్షణ మొదలైంది.

టీచర్‌పై విద్యార్థి దాడి.. వీడియో వైరల్..

పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లకు మధ్య ఇటీవల గొడవలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఎన్టీఆర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాఠశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థికి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కృష్ణా జిల్లా (Krishna District) బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో విద్యార్థి, నాన్‌ టీచింగ్ స్టాఫ్‌కు మధ్య గొడవ జరిగింది. ఓ విద్యార్థి తల్లిని నాన్ టీచింగ్ స్టాఫ్ దుర్భాషలాడడంతో ఘర్షణ మొదలైంది. సదరు టీచర్‌పై పదో తరగతి విద్యార్థి.. (Student attacks teacher) పిడిగుద్దులు కురిపించాడు. నా తల్లినే తిడతావా.. అంటూ కోపంతో ఊగిపోయాడు. గొడవ జరగడంతో మిగతా టీచర్లంతా అక్కడికి వచ్చారు. ఆ విద్యార్థిని వారించే ప్రయత్నం చేశారు. తన తల్లిని తిట్టడంతో దాడి చేశానని సదరు విద్యార్థి తెలిపాడు.


దీనిపై బాధిత టీచర్ మాట్లాడుతూ.. ఆ విద్యార్థి చెడు వ్యసనాలకి బానిసయ్యాడని, మందలించే ప్రయత్నం చేయగా దాడి చేశాడని ఆరోపించారు. సమస్య ఉంటే ప్రధానోపాధ్యాయులకు ఫిర్యాదు చేయాలి గానీ.. ఇలా భౌతిక దాడులకు దిగడం తగదంటూ.. ఆ విద్యార్థిని మిగతా ఉపాధ్యాయులు వారించారు. అనంతరం ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. చివరకు ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు సర్దిచెప్పడంతో ఇద్దరూ తమ ఫిర్యాదులు వెనక్కు తీసుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ వీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 02:15 PM