Share News

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు విరాళాలు.. డీజీపీకి చెక్కుల అందజేత

ABN , Publish Date - Oct 31 , 2026 | 03:12 PM

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.42.5 లక్షల సీఎస్ఆర్ నిధులు జమ అయ్యాయి. ఈ స్కూల్‌కు మూడు కార్పొరేట్ సంస్థల నుంచి రూ.42.5 లక్షల విరాళం అందాయి.

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు విరాళాలు.. డీజీపీకి చెక్కుల అందజేత
Young India Police School

హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.42.5 లక్షల సీఎస్ఆర్ నిధులు జమ అయ్యాయి. ఈ స్కూల్‌కు మూడు కార్పొరేట్ సంస్థల నుంచి రూ.42.5 లక్షల విరాళం అందాయి. కోహినూర్ గ్రూప్‌‌నకు చెందిన AQ Square Realtors రూ.25 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు సంస్థ ప్రతినిధులు చెక్కును ఇచ్చారు.


పుజోలానా మెషినరీ ఫ్యాబ్రికేషన్స్ ఎండీ ఆదిత్య పాయ్, ఆర్యన్ ప్రెసిషన్ సంస్థ తరఫున రూ.10 లక్షల విరాళం అందజేశారు. దివ్యశక్తి గ్రూప్ వ్యవస్థాపక డైరెక్టర్ రవీంద్ర కుమార్ అగర్వాల్ రూ.7.5 లక్షలు ఇచ్చారు. విద్యాభివృద్ధికి ముందుకొచ్చిన సంస్థల ప్రతినిధులను డీజీపీ ఆనంద్ అభినందించారు. పోలీసు సిబ్బంది పిల్లల విద్యాభివృద్ధికి ఈ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సమాజానికి పోలీసు సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఆయా సంస్థలు సహకారం అందిస్తున్నాయని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు


ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 03:43 PM