మోదీ రూ.151 లక్షల కోట్లు అప్పు చేశారు: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:52 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పులు ఎక్కువగా చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందరూ ప్రధాన మంత్రుల కంటే మోదీ అప్పులు ఎక్కువ చేశారని తెలిపారు.
హైదరాబాద్, జులై 30 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పులు ఎక్కువగా చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఆరోపించారు. అందరూ ప్రధాన మంత్రుల కంటే మోదీ అప్పులు ఎక్కువ చేశారని తెలిపారు. ఈరోజు (గురువారం) ఎంసీహెచ్‌ఆర్డీలో(MCRHRD) సీఎం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్రం నుంచి 2014 వరకూ రూ.51లక్షల కోట్ల అప్పు ఉందని వివరించారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రధాని రూ.151లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. విమర్శలు గుర్తు చేసుకుంటూ ఉంటే మనం మనుగడ సాధించలేమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
రామచందర్ రావుకి సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావుకి సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విద్యావ్యవస్థ తమ హయాంలో బలపడిందని తెలిపారు. 28వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం ఇప్పుడు దేశంలో 18వ స్థానానికి చేరిందని వ్యాఖ్యానించారు. తాను ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. విద్యాశాఖకు మంత్రి లేరని.. తాను రాజీనామా చేయాలని ప్రతిపక్షాల నేతలు అంటున్నారని అన్నారు. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్ పెట్టినందుకు రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. తాను కూడా మెలకువలు నేర్చుకోవడానికి హార్వర్డ్ వెళ్లానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు.
వార్తలు కూడా చదవండి...
‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి: భట్టి విక్రమార్క
హైడ్రాపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News