కాళేశ్వరంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు: తెలంగాణ కేబినెట్
ABN , Publish Date - Nov 05 , 2026 | 08:29 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈరోజు (గురువారం) రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈరోజు (గురువారం) రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులో రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిశ్చయించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై మూడేళ్లుగా చేస్తున్న మరమత్తులు అసెంబ్లీలో వివరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కాళేశ్వరం పరివాహక జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు గోదావరిని సందర్శించాలని ఆదేశించారు.
గోదావరి నుంచి నీటి ప్రవాహం, ఎత్తిపోతల ప్రక్రియను క్షేత్రస్థాయిలో వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. గోదావరి వద్దే మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు తరలించారనే ప్రచారంలో వాస్తవాలను ప్రజలకు వివరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు తిప్పి కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క
భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News