Share News

మెట్రో ఫేజ్-2 పనుల్లో వేగం పెంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Aug 11 , 2026 | 03:39 PM

హైదరాబాద్ పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మెట్రో ఫేజ్-2 పనుల్లో వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు.

మెట్రో ఫేజ్-2 పనుల్లో వేగం పెంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) సంబంధిత అధికారులను ఆదేశించారు. మెట్రో ఫేజ్-2 పనుల్లో వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట మెట్రో కారిడార్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. 7.5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. మెట్రో పనులకు వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. పాతబస్తీ మెట్రో పనులపై సంబంధిత అధికారులతో సీఎం ఈరోజు (మంగళవారం) MCRHRDలో సమీక్ష సమావేశం నిర్వహించారు.


పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి..

పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశం చేశారు. మెట్రో రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లు కొనుగోలు చేయాలని సూచించారు. ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రో సలహాలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత సమ్మిట్ పెట్టుబడులపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.


అంతర్జాతీయ ప్రమాణాలతో ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్..

అంతర్జాతీయ ప్రమాణాలతో ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖులను సన్మానించాలని సూచించారు. గత ఏడాది పెట్టుబడులు, పురోగతిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.


వార్తలు కూడా చదవండి...

'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 11 , 2026 | 04:00 PM