శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసు.. సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్
ABN , Publish Date - Sep 15 , 2026 | 12:53 PM
శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
ఢిల్లీ, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ (Shantha Sriram Constructions) వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసుపై సుప్రీంకోర్టులో (Supreme Court) ఈరోజు (మంగళవారం) విచారణ జరిగింది. ఈ కన్‌స్ట్రక్షన్‌కి వ్యతిరేకంగా తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర హైకోర్టు తీర్పును సకాలంలో సవాలు చేయలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
తగిన సమయంలో కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణకు తీసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం డిస్మిస్ చేసింది. గతంలో ఇదే కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్
అసెంబ్లీ ఘటన.. మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారిస్తున్న పోలీసులు
శంషాబాద్‌లో బస్సు బీభత్సం.. హోటల్‌ల్లోకి దూసుకెళ్లి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News