Share News

ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు కొత్త డీజీ.. బాధ్యతలు చేపట్టిన సౌమ్య మిశ్రా

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:09 PM

ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా సోమవారం హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణ, సాధికారతకు మరింత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు కొత్త డీజీ.. బాధ్యతలు చేపట్టిన సౌమ్య మిశ్రా
Sowmya Mishra

హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఈరోజు (సోమవారం) హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణ, సాధికారతకు మరింత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. స్త్రీల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. కమ్యూనిటీ భాగస్వామ్యం, జెండర్ సెన్సిటైజేషన్‌పై దృష్టిసారిస్తామని వెల్లడించారు.


మహిళలపై హింస, వేధింపుల నివారణకు సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే అమలవుతున్న మహిళా భద్రతా కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. మహిళలు, చిన్నారులు గౌరవంగా, భద్రంగా, ఆత్మవిశ్వాసంతో జీవించే సమాజ నిర్మాణానికి కృషి చేస్తానని సౌమ్య మిశ్రా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 05:32 PM