Share News

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం

ABN , Publish Date - Oct 12 , 2026 | 08:27 AM

హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని కొండాపూర్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో హరియాణాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సౌరభ్ శేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం
Software Employee Death

హైదరాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హీలియం గ్యాస్ పీల్చుకుని హరియాణాకు చెందిన సౌరభ్ శేఖర్ (36) ఆత్మహత్య చేసుకున్నాడు. కొండాపూర్‌లోని వీవీ హైట్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత స్నేహితుడిని కలిసి వస్తానని శనివారం ఇంటి నుంచి సౌరభ్ శేఖర్ బయలుదేరాడు. అయితే, నిన్న (ఆదివారం) బేబీ హైట్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


సోదరుడు అతనికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లాడు. తలుపులు పగలగొట్టి చూడగా మృతదేహం కనిపించింది. ఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్లుగా భోజనం తర్వాత కడుపునొప్పితో సౌరభ్ బాధపడుతున్నాడని అతని సోదరుడు తెలిపాడు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సిబ్బందికి ప్రమాదం

యువత రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్‌లో బతకాలి: హరీశ్‌రావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 09:44 AM