డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. సిట్ ముందు హాజరైన అభిషేక్ సింగ్, రాకేశ్‌వర్మ
ABN , Publish Date - May 26 , 2026 | 10:40 AM
బీఆర్ఎస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన మూడు ప్రధాన మార్గాలను గుర్తించారు.
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డికి (Pilot Rohith Reddy) చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన మూడు ప్రధాన మార్గాలను గుర్తించారు. ఈ వ్యవహారంలో పలువురు డ్రగ్స్ సప్లయర్లు కూడా ఉన్నారని సిట్ అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న అభిషేక్ సింగ్, రాకేశ్ వర్మలను ఇటీవల సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి కొన్ని రోజుల పాటు సిట్ విచారణ నుంచి ఉపశమనం పొందారు. అనంతరం, హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పరారీలో క్లింటన్..
పోలీసుల విచారణ సందర్భంగా రాకేశ్ వర్మ (Rakesh Varma) గత డిసెంబర్‌లో ముంబైకి చెందిన మజార్ అనే వ్యక్తి నుంచి కొకైన్ కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. అనంతరం ఆ డ్రగ్స్‌ను కౌశిక్ రవికి అందించినట్లు సిట్‌కు తెలిపాడు. బహదూర్‌పురాలో బ్యాటరీ వ్యాపారం నిర్వహిస్తున్న రాకేశ్ వర్మకు, ఇంటీరియర్ వర్క్స్ కారణంగా అభిషేక్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఫాంహౌస్ పార్టీకి ముందు అభిషేక్ సింగ్‌కు ఒక డ్రగ్స్ పార్సిల్ అందజేసినట్లు కూడా రాకేశ్‌వర్మ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. మరోవైపు గోవా నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్న క్లింటన్ అనే వ్యక్తి ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో కీలకంగా గన్‌షాట్ ఘటన
ఈ కేసులో గన్‌షాట్ ఘటన కూడా కీలకంగా మారింది. నమిత్ శర్మ చేతులకు అంటుకున్న గన్ పౌడర్ ఆనవాళ్లను ఫోరెన్సిక్ పరీక్షలకు సిట్ అధికారులు పంపించారు. ఈ పరీక్షలు పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో పార్టీ సమయంలో కాల్పులు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్, పార్టీ నిర్వహణ, కాల్పుల ఘటనలపై సిట్ అధికారులు మరింత సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కేంద్రం సహకరించకున్నా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన విధానాలతో రైతాంగం కష్టాల్లో ఉన్నారు: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And International News And Telugu News