Share News

హైకోర్టు న్యాయవాది హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..

ABN , Publish Date - May 25 , 2026 | 08:59 AM

తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.10 లక్షల సుపారీతో ఐదుగురు సభ్యుల ముఠా హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

హైకోర్టు న్యాయవాది హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..
Advocate Khaja Moinuddin Case

హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.10 లక్షల సుపారీతో ఐదుగురు సభ్యుల ముఠా న్యాయవాది హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. కిషన్‌ అనే వ్యక్తి ద్వారా వినయ్‌ గ్యాంగ్‌తో ఈ హత్యకు ఒప్పందం కుదుర్చకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన అనుమానితుడు వినయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో నలుగురు నిందితులు గోవా, కల్వకుర్తికి పారిపోయినట్లు గుర్తించారు. అయితే, పోలీసుల అదుపులోనే నిందితులు ఉన్నట్లు సమాచారం.


న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్యకు ఉపయోగించిన సెకండ్‌హ్యాండ్‌ కారును ఆరునెలల ముందే కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. న్యాయవాది కదలికలపై నిందితులు పలుమార్లు రెక్కీ నిర్వహించారు. న్యాయవాదిని ఇంటి వద్ద కారుతో ఢీకొట్టి 20 మీటర్లు లాక్కెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌‌లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. వక్ఫ్‌ భూముల వివాదం హత్యకు ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ నాన్నకు ముందే బెదిరింపులు వచ్చాయిని మృతుడి కుమారుడు ఫర్హాన్ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముజాహిద్‌ ఆలంఖాన్, మహబూబ్‌ ఆలంఖాన్ ల నుంచి పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసును వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 25 , 2026 | 09:05 AM