సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య 34 పండుగ స్పెషల్ రైళ్లు
ABN , Publish Date - Oct 10 , 2026 | 08:03 AM
సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో 34 ప్రత్యేకరైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
యాదాద్రి రైల్వేస్టేషన్‌లోనూ అదనపు స్టాపేజీ
హైదరాబాద్ సిటీ: బతుకమ్మ, నవరాత్రి, దసరా పండుగల రద్దీని పురస్కరించుకొని సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో 34 ప్రత్యేకరైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. శనివారం నుంచి ఈ నెల 25వరకు ఈ ప్రత్యేకరైళ్లు అందుబాటులో ఉంటాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
అయితే, ఈ ప్రత్యేకరైళ్లకు రెగ్యులర్ స్టాపేజీలతో పాటు యాదాద్రి రైల్వేస్టేషన్‌లోనూ అదనపు స్టాపేజీ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
తెలంగాణకు 2.981 టీఎంసీలు ఇవ్వండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News