Share News

రాష్ట్రానికి త్వరలో 750 ఎలక్ర్టిక్‌ బస్సులు

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:17 AM

రాష్ట్రానికి త్వరలో 750 కొత్త ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు రాబోతున్నాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. ఇక నుంచి అన్నీ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులనే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రానికి త్వరలో 750 ఎలక్ర్టిక్‌ బస్సులు

  • ఇక పల్లె వెలుగులు కూడా ఎలక్ట్రిక్‌ ఏసీలే..

  • రవాణా మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి వెల్లడి

ప్రొద్దుటూరు, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి త్వరలో 750 కొత్త ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు రాబోతున్నాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. ఇక నుంచి అన్నీ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులనే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. పల్లె వెలుగు స్ర్తీశక్తి బస్సులు కూడా ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులే ఉంటాయన్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి శుక్రవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్మించిన నూతన ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో వున్న కారుణ్య నియామకాలు చేపట్టామని, ఆర్టీసీ ఉద్యోగులకు అలవెన్సులు పెంచామన్నారు. స్త్రీశక్తి పథకాన్ని భారంగా కాకుండా బాధ్యతగా అమలు చేస్తున్నామన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 06:17 AM