Share News

రహస్యంగా వైద్యం చేయించుకుంటున్న కేటీఆర్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 07:02 AM

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. తన ఫామ్‌హౌ్‌సలో రహస్యంగా వైద్యం చేయించుకుంటున్నారని ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌ ఆరోపించారు.

రహస్యంగా వైద్యం చేయించుకుంటున్న కేటీఆర్‌

  • డ్రగ్స్‌ ఆనవాళ్లు బయటపడొద్దనే..

  • బల్మూర్‌ వెంకట్‌ ఆరోపణ

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. తన ఫామ్‌హౌ్‌సలో రహస్యంగా వైద్యం చేయించుకుంటున్నారని ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌ ఆరోపించారు. డ్రగ్గిస్ట్‌ అయిన ఆయన.. శాంపిళ్లు బయటపడకుండా ఉండేందుకే రహస్యంగా హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటున్నారన్నారు. ఈ రహస్య వైద్యం కోసం లండన్‌ డాక్టర్‌కు కేటీఆర్‌ రూ.5 కోట్లు చెల్లించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తనకు జ్వరం వచ్చిందని, తనను ఎవరూ కలవకూడదంటూ బీఆర్‌ఎస్‌ నేతలకు ఆయన మెసేజ్‌లు పెట్టారన్నారు. నిజంగా కేటీఆర్‌కు జ్వరమే వస్తే సోషల్‌ మీడియా లైవ్‌లోకి రావాలని సవాల్‌ విసిరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శివార్ల నుంచి ముంగిళ్లలోకొచ్చి బతుకమ్మగా పువ్వుల నవ్వులు!
ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం

రూ.1000 కోట్ల లావాదేవీలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 07:02 AM