Share News

శివార్ల నుంచి ముంగిళ్లలోకొచ్చి బతుకమ్మగా పువ్వుల నవ్వులు!

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:46 AM

బంతులు, చేమంతులు, తంగేళ్లు, గునుగులు, సీతమ్మజడలు ఇలా తీరొక్క పూలన్నీ కొమ్మారెమ్మల నుంచి విడివడి వచ్చి బతుకమ్మగా ఒకచోట కలిశాయి!

శివార్ల నుంచి ముంగిళ్లలోకొచ్చి బతుకమ్మగా పువ్వుల నవ్వులు!
Thousand Pillar Temple

  • నేడు ఎంగిలిపూల బతుకమ్మ

  • సద్దుల బతుకమ్మ దాకా

  • 9 రోజుల పాటు సంబురాలు

  • బతుకమ్మ పేర్చేందుకు పువ్వులేవి?

  • వర్షాభావంతో అడవుల్లో పూలే లేవు

  • తంగేడు గుత్తి రూ.100..

  • 4 గునుగు కట్టలు రూ.120 దాకా

హనుమకొండ, అక్టోబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): బంతులు, చేమంతులు, తంగేళ్లు, గునుగులు, సీతమ్మజడలు ఇలా తీరొక్క పూలన్నీ కొమ్మారెమ్మల నుంచి విడివడి వచ్చి బతుకమ్మగా ఒకచోట కలిశాయి! మలిసంధ్య వెలుగుల్లో వాకిళ్లలో కొలువుతీరిన బతుకమ్మల చుట్టూ మహిళల ఆటలు.. ఉయ్యాలో ఉయ్యాల అంటూ పాటలు! నేటి నుంచి పల్లెలు, పట్నాలనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదిరోజులపాటు ఇదే సంబురం కనిపించనుంది. బతుకమ్మ వేడుకలు వచ్చేశాయి. శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే వేడుక సద్దుల బతుకమ్మ దాకా కొనసాగనుంది.


హనుమకొండలోని వేయిస్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 50వేల మందికిపైగా మహిళలు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే బతుకమ్మ పేర్చేందుకు పువ్వులు బంగారమైపోయాయి! తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పూల దిగుబడులు భారీగా పడిపోయాయి. బీడు భూములు, గెట్లు, చేలల్లో సహజసిద్ధంగా లభించే తంగేడు, గునుగు పువ్వు కూడా దొరకడం లేదు. పూల కొరత కారణంగా మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. తంగేడు పూల గుత్తి రూ.100కు విక్రయిస్తున్నారు. మూడు, నాలుగు గునుగు కట్టలను రూ.100 నుంచి రూ.120కి అమ్ముతున్నారు. కిలో బంతి పూలు రూ.150కి, యాభై గ్రాముల చేమంతులు రూ.50కి అమ్ముతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పట్నం నుంచి పల్లెకు పయనం

ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం

హైస్పీడ్‌ రైళ్ల అలైన్‌మెంట్‌ ఖరారు కాలేదు
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 05:46 AM